![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -383 లో... ఫణీంద్రకి రామలక్ష్మి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వు నీ భర్త తో హ్యాపీగా ఉన్నావని సంతోషపడాలో లేక మా మనవరాలు మైథిలీ మాకు దూరం అయిందని బాధపడాలో అర్ధం అవ్వడం లేదని సుశీల బాధపడుతుంటే.. ఇన్నిరోజుల తర్వాత తన భర్తతో ఉంటుంది. మన కోసం తన సంతోషం దూరం చేసుకోమనడం కరెక్ట్ కాదని ఫణీంద్ర అంటాడు. మీరేం టెన్షన్ పడకండి నేను ఎప్పటికి నీ మనవరాలినే అని రామలక్ష్మి అనగానే.. ఫణీంద్ర, సుశీల హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరుసటిరోజు రామలక్ష్మి రెడీ అయి బయటకి వెళ్తుంది. అక్కడ కొంతమంది రౌడీలు తన చుట్టు చేరి ఎటాక్ చేస్తారు. రామలక్ష్మిని ఒక రౌడీ కత్తితో పొడవడానికి చూస్తుంటే.. అప్పుడే శ్రీలత వచ్చి రౌడీని కొడుతుంది. నిన్ను సీతని సందీప్ చంపాలనుకుంటున్నాడు.. వద్దన్నందుకు నన్ను బంధించాడని రామలక్ష్మికి శ్రీలత చెప్తుంది. అది విని రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ రౌడీల దగ్గరికి సందీప్ వచ్చి.. ఎవరు అడ్డువచ్చినా లేపేయండి అని చెప్తాడు. ఇక శ్రీలత.. సీతా అని గట్టిగా అరవడంతో సీతాకాంత్ బయటకు వస్తాడు.
రామలక్ష్మిని సందీప్ కత్తితో పొడవబోతుంటే సీతాకాంత్ వచ్చి ఆపుతాడు. కన్నతల్లిని చంపాలనుకుంటావా అని సందీప్ పై సీతాకాంత్ కోప్పడతాడు. ఇక సీతాకాంత్ రౌడీలని కొట్టగా వాళ్లు పారిపోతారు. ఇక సందీప్ ని సీతాకాంత్ కత్తితో పొడవబోతుంటే.. వద్దని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఇక అక్కడే ఉన్న రామలక్ష్మి.. వద్దండి ఇక నా వల్ల కాదు.. మీకు దూరంగా ఉండడం మీకేం ప్రాబ్లమ్ రాకూడదని ఇన్నిరోజులు మైథిలీగా నటించాను.. నేను మీ రామలక్ష్మినే అని తను చెప్పగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత సందీప్ క్షమాపణ అడుగుతాడు. అదే విధంగా సవతి తల్లి శ్రీలత కూడా క్షమించమని అడుగుతుంది.
ఆ తర్వాత అందరు కలిసి లోపలికి వెళ్తారు. రామ్ దగ్గర కి వెళ్లి ఆ ఫోటోలో ఉన్న రామలక్ష్మి ఈవిడే అని సీతాకాంత్ అనగానే రామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఓవైపు రామలక్ష్మి, మరోవైపు సీతాకాంత్ ఉండగా మధ్యలో రామ్ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకేసారి రామ్ కి ముద్దు ఇవ్వబోతుంటే రామ్ వెనక్కి వెళ్తాడు. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారు. వాళ్ళని చూసిన శ్రీలత.. ఏంటి ఇద్దరికి.. 'ఎటో వెళ్లిపోయిందా మనసు' అని శ్రీలత అంటుంది. ఇక అందరు ఒకే ఫ్రేమ్ లో నిలబడి స్మైల్ ఇస్తారు. దాంతో ఈ సీరియల్ కి శుభం కార్డ్ పడుతుంది.
![]() |
![]() |